MLC Election Results: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. అయితే, ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు (మార్చ్ 3వ తేదీ) తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది.
Read Also: NKR 21: కళ్యాణ్ రామ్ సినిమా ఇన్ సైడ్ టాక్..
ఇక, రేపు గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క టేబుల్ కు ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. ఒకటవ ప్రాధాన్యత ఓట్ లో ఎవరైనా అభ్యర్థికి 50 శాతానికి మించి మెజారిటీ రాకపోతే, రెండవ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. అలాగే, బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే, రెండు రోజులు కూడా పట్టే అవకాశం ఉండటంతో.. 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే, ఏసీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. నిరంతరం వెబ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొనింది.
Read Also: Britain- Ukraine: ఉక్రెయిన్కి మద్దతుగా ఐరోపా దేశాలు.. బ్రిటన్ భారీ సాయం
అయితే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 లక్షల 18 వేల 902 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 17 రౌండ్లులలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు.. చెల్లుబాటు కానీ ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
Read Also: Fake Darshan Tickets: శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు.. పోలీసులకు వరుస ఫిర్యాదులు
మరోవైపు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఆంధ్రా యూనివర్శిటీ ఈఈఈ బిల్డింగ్ లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. మూడు అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన వస్తే.. ఫలితం మరింత ఆలస్యం కావొచ్చు అని ఈసీ పేర్కొనింది. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే.. సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందనీ అధికారులు అంచనా వేస్తున్నారు.