NTV Telugu Site icon

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్..

Mlc Elections

Mlc Elections

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసే నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 65.43 శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో 87.30 శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్‌టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి 61.99 శాతం నమోదు అయింది.

Read Also: DC: ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కెవిన్ పీటర్సన్..

మరోవైపు, తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 40.61 శాతం, ఇవే జిల్లాల్లో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 63.49 శాతం పోలింగ్ నమోదు కాగా, వరంగల్- నల్లగొండ- ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 76.35 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. కాగా, వచ్చే నెల 3వ తేదీన తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది.