Site icon NTV Telugu

YSRCP: ఎమ్మెల్సీ అనంత్‌బాబు రిమాండ్ పొడిగింపు

Mlc Anantha Babu

Mlc Anantha Babu

కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌​ను కోర్టు మరో 15 రోజుల పాటు పొడిగించింది. శుక్రవారంతో అనంత్‌బాబు రిమాండ్​ ముగియడంతో పోలీసులు ఎస్కార్ట్​ సాయంతో ఆయన్ను కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్​ గడువు పెంచడంతో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ను.. గత నెల 17న కోర్టు కొట్టి వేసింది.

తన మాజీ డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ పార్టీ చెందిన ఎమ్మెల్సీ అనంత్‌బాబు నిందితుడిగా ఉన్నాడు. ఈ మొదట సుబ్రమణ్యం ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పిన అనంత్‌బాబు.. సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు ఆందోళనకు దిగడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే.. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లో ఉన్నారు.

 

Exit mobile version