Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వంశీకి అస్వస్థత.. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొహాలీలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్టు చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌లో గతేడాది సీటు సాధించిన వంశీ.. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (AMPPP) కోర్సు చేస్తున్నారు. పంజాబ్ లోని మొహాలీ క్యాంపస్‌లో తరగతులకు హాజరవుతున్నారు. నిన్న క్లాస్‌కు వెళ్లిన ఆయనకు ఎడమచేయి లాగినట్టు అనిపిస్తుండడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడాయనకు ఈసీజీ, 2డీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఒకటి రెండు రోజుల్లో వంశీని డిశ్చార్జ్ చేస్తామని కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందించారు.
నిత్యం రాజకీయాల్లో బిజీగా వుండే వంశీ.. ఐఎస్‌బీ లో సీటు సాధించి అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు చదువుతున్నారు. ఇటీవలి కాలంలో గన్నవరం పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. అయితే, వంశీ విజయవాడలో కాకుండా ప్రస్తుతం మొహాలీలో వుంటున్నారు. చదువు నిమిత్తం ఆయన అక్కడే వున్నారు. స్వల్ప అనారోగ్యమే అనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు వంశీ కుటుంబీకులు.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!