ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన కామెంట్లు చేశారు. గత మూడు రోజులు గా వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారు..నేను అజ్ఞాతం లో ఉన్నానని అంటున్నారు. మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళాను. వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు అన్నారు ఉండవల్లి శ్రీదేవి.నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా? లేదా సీసీ కెమెరా పెట్టారా?నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు. నన్ను ఎందుకు వేధిస్తున్నారు? నన్ను పిచ్చి కుక్క లాగా నిందవేసి బయటకు పంపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.