Site icon NTV Telugu

Mla Roja With Governor Tamilisai: గవర్నర్ తమిళిసైతో ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ

గవర్నర్ తో MLA రోజా స్పెషల్ ఇంటర్వ్యూ|Governor Tamilisai Exclusive Interview |MLA Roja |Women's Day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వనిత టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా సెల్వమణి ముచ్చటించారు. ఇది వనిత టీవీకి ప్రత్యేకం.

ఓ సాధారణ మహిళ మంచి డాక్టర్ అవుతుంది. ఓ సాధారణ మహిళ గవర్నర్ గా మారి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మహిళలు అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. తన తల్లి తనకు స్ఫూర్తి అన్నారు. నాయకత్వ లక్షణాలు అమ్మని చూసి నేర్చుకున్నాను.

బాల్యంలో నాయకత్వ లక్షణాలు నాకు వుండేవి. స్టూడెంట్ లీడర్ గా పనిచేశాను. మెడికల్ కాలేజీలోనూ లీడర్ గా వున్నాను. మెడికల్ కాలేజీలో వున్న ప్పుడు ప్రముఖులతో పరిచయం అయ్యారు. మేం ఇంట్లో ఐదుగురం. నా తోడబుట్టిన వారితో నాకెంతో అనుబంధం వుంది. కరోనా సమయంలో నా కుటుంబీకులు అంతా నా దగ్గర వున్నారు. నాకు వంట చేయడం ఇష్టం. బయట ఎంత హోదాలో వున్నా.. మహిళ మహిళే. ఇంట్లో భార్యగా, తల్లిగా, అక్కగా తన బాధ్యతలు నిర్వర్తించాలి. కరోనా సమయంలో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టడం వల్ల ట్రావెల్ చేశాను.

అరేంజ్డ్ మ్యారేజ్ అనంతరం లవ్. ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. నా భర్త చాలామంచివారు. సమయం లేకపోవడం వల్ల గొడవలకు అవకాశం లేదు. మీటింగ్ వుంటే ఫైటింగ్ వుంటుంది. నేను పేషంట్లతో ఎక్కువ బిజీగా వుండేదాన్ని. నా తండ్రి రాజకీయ నాయకుడిగా వుండేవారు. నా తండ్రిది నేషనల్ మైండ్. నేను నేషనలిజం నమ్ముతాను. అభివృద్ధి గురించి ఆలోచించేదాన్ని.ఈఇంటర్వ్యూలో అనేక అంశాలు ప్రస్తావించారు తమిళి సై సౌందరరాజన్.

Exit mobile version