ఒకవైపు రాజకీయాలు, మరోవైపు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ బాధ్యతలు. జబర్దస్త్ జ్యూరీ క్షణం కూడా తీరిక లేని రోజా క్రీడల్లోని పాల్గొని అభిమానులను, నియోజకవర్గ ప్రజలను ఉత్సాహ పరుస్తూ వుంటారు. గతంలో కబడ్డీ ఆడిన రోజా తన భర్తకే చుక్కలు చూపించారు. ఆయన్ని ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే.
ALSO READ: ఎమ్మెల్యే రోజా కబడ్డీ .. కబడ్డీ
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో మంచి విధానాలతో ప్రతి విషయంలో ముందడుగు వేయాలన్నారు రోజా. దీని ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వివిధ మండలాల్లో త్రోబాల్ ఆడిన క్రీడాకారులు ఫైనల్స్ కి చేరుకుని నగరిలో ఆడటం శుభపరిణామం అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆడటం దీని ద్వారా కొత్త పరిచయం ఏర్పడుతుందని రోజా అన్నారు. నగరిలో నేడు త్రో బాల్ ఫైనల్స్ ఆట ప్రారంభం సందర్భంగా రోజా మాట్లాడారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం రోజా ట్రస్ట్ తరఫున ఒకటో తారీకు నుంచి 16 వ తారీఖు వరకు నగరి డిగ్రీ కళాశాల యన్.టి.ఆర్. క్రీడా మైదానంలో గ్రామీణ క్రీడా సంబరాలు -2021 జరిగాయి. ఈ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా త్రో బాల్ ఫైనల్స్ సందర్భంగా యువకులను ఉత్సాహపరుస్తూ త్రో బాల్ ఆటను ఆడి ప్రారంభించారు. రోజా క్రీడాకారులతో కలిసి త్రో బాల్ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎక్కడ ఏ క్రీడా సంబరాలు జరిగినా రోజా పాల్గొంటూ వుంటారు. విద్యార్థులందరినీ ఉత్సాహపరిచే వారిలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నగరి నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడమే ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని పెంపొందించే క్రీడలు ఆడటం వలన మైండ్ సెట్ మారుతుందన్నారు.
శారీరక పరంగా ఉత్తేజాన్ని కలిగించి దృఢమైన నిర్ణయాలు తీసుకునే మానసిక స్థాయి కలుగుతుందన్నారు రోజా. విద్యార్ధులు చిన్న చిన్న విషయాలకు మానసికస్థితి కోల్పోతున్నారని ఆవేదన చెందారు. తమ మానసిక స్థితిని క్రీడలు ఆడటం వలన క్రియాశీలకంగా ఆలోచించే స్థాయికి ఎదుగుదల వస్తుందని రోజా అన్నారు. విద్యతో పాటు క్రీడాపోటీల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. విద్యతో పాటు ఆటలను సమానంగా చూడడం వలన జీవితం చాలా సాఫీగా సాగుతుందని ఎమ్మెల్యే అన్నారు