NTV Telugu Site icon

Raghuramakrishnaraju: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు నామినేషన్..

Raghurama

Raghurama

Raghuramakrishnaraju: ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఈరోజు (బుధవారం) నామినేషన్‌ దాఖలు చేశారు. రఘురామతో పాటు మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌, నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. అలాగే, వీరితో పాటు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఉపసభాపతి స్థానానికి నామినేషన్ దాఖలు చేయటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు చెప్పుకొచ్చారు. ఇతర ఏ నామినేషన్‌లు రాకపోతే తన ఎన్నిక ఏకగ్రీవం అవుతుందన్నారు.

Read Also: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త సేవలు ప్రారంభం.. డేటాతో పనిలేకుండా ఐఎఫ్‌టీవీ ప్రసారాలు

ఇక, తాజా ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంత‌కు ముందు 2019 ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నిక‌లకు ముందు రఘురామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తెలుగు దేశం పార్టీలో చేరారు.

Show comments