Site icon NTV Telugu

Pantham Nanaji: రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ చైర్మన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్యే నానాజీ..

Nanaji

Nanaji

Pantham Nanaji: కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు.. కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడేందుకు యువకులకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో వివాదం స్టార్ట్ అయింది. బెట్టింగులు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న కాలేజ్ సిబ్బంది వెల్లడించింది. అయిన సదరు యువకులు వినకుండా వాలీబాల్ ఆడేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని ఆర్ఎంసీ కాలేజ్ సిబ్బంది అడ్డుకుంది.

Read Also: Pawan Kalyan: శ్రీవారికి అపచారం.. 11 రోజుల పాటు పవన్‌ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

ఇక, యువకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయడంతో.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు తనను తిట్టాడు కాబట్టి ఇక్కడికి వచ్చానంటున్న ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్పుకొచ్చారు. విపరీతమైన కోపంలో చంపేస్తాను లం- కొడకా అంటూ రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ను జనసేన శాసన సభ్యులు దుర్భాషలాడారు. కాగా, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version