NTV Telugu Site icon

Nandamuri Balakrishna: నవరత్నాల మాయలో పడొద్దు

Balayya

Balayya

అనంతపురంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాదయాత్రలో గంజాయి వద్దు బ్రో అంటూ క్యాంపెయిన్ చేశారు నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ. లోకేష్ పాదయాత్ర కి సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్నారు బాలకృష్ణ, గంజాయి వద్దు బ్రో అని రాసి ఉన్న క్యాప్ ధరించి యువత కు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి అంటూ మెసేజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై విమర్శలు చేశారు బాలకృష్ణ. నవరత్నాల మాయలో పడి ఓటుని వృధా చేసుకోవద్దన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

యువతకు టీడీపీ లో జరిగింది ఏంటి..? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి.? తెలుసుకోవాలన్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ. ముఖ్యమంత్రి కి మెగా బైట్స్, గిగా బైట్స్ అంటే ఏంటో తెలుసా…?రాష్ట్రంలో ఏం జరుగుతుందో…లోకేష్ రాష్ట్ర పరిస్థితులను వివరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్త పడాలి. ఏపీలో అసమర్ధ పాలన… చెత్త పరిపాలన నడుస్తోంది. రాజధాని లేని రాష్ట్రం… పోలవరం ఊసేలేదు..అభివృద్ధి ఏం లేదు…సప్త శూన్యం. ఉద్యోగాలు లేవు…వలస పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. గంజాయి రాష్ట్రంగా ఏపీ నెంబర్ వన్. చెత్త మీద పన్ను…మన ఖర్మ. శాండ్, ల్యాండ్ మాఫియా రాష్ట్రంలో రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు బాలయ్య.

Read Also: Pahadi Shareef Crime: క్యాబ్​ డ్రైవర్​ పై అటాక్​.. కత్తితో దాడి చేసి కారుతో పరార్‌

ప్రశ్నిస్తే…. కేసులు… హత్యారాజకీయాలు. అమరావతి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. బాదుడే బాదుడు దెబ్బతినని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా…రాష్ట్రంలో అంతా వినాశనం…అభివృద్ధి లేదు అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. పరిపాలన చేతకాదు…సలహాదారు లంతా ఒక సామాజికవర్గానికి చెందిన వారే. ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాల్సింది ప్రజలే. నవరత్నాల మాయలో పడొద్దు అన్నారు. మీ కోసం మీరే మీ నాయకుడిని ఎన్నుకోవాలి. ఓటు ఒక ఆయుధం ఓటు విలువ తెలుసుకోవాలి. కులాల రొచ్చులో పడొద్దు.విష్యత్ గుర్తుపెట్ఠుకోవాలి. ఆంధ్రరాష్ట్రం పచ్చగా ఉండాలనే యువగళం.వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు…సేవ చేయడానికి వస్తే మంచిదే.. జనం అంటే జగన్ కు కక్ష..అదో రకమైన సైకోతత్వం..సైకాలజీ చదవలేదు గాని… మనుషుల సైకాలజీ తెలుసు. టిడ్కో ఇళ్ళు ఇచ్చినా… వాటిలోకి వెళ్ళొద్దు…మెయింటెనెన్స్ లేక అవి కూలిపోతాయి. టీడీపీని గెలిపించుకుందాం… లేదంటే ఓటే… వేటు అవుతుంది అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.

Read Also: Extramarital affair: లవర్ తో కలిసి భర్తను హతమార్చిన భార్య.. ఉప్పును ఉపయోగించి..