రెండు సంవత్సరాలలో అని సంక్షేమ పథకాలు అమలు చేశాం. దాదాపు 90 శాతం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం కూడా అమలు చేస్తాం. ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసినందుకు వారికి న్యాయం చేస్తున్నాం అని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంథంగా భావించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. కరోనాతో తల్లితండ్రులు చనిపోయిన పిల్లలకు 10 లక్షల ఆర్థిక సహాయం ఆదిస్తుంది ప్రభుత్వం. తల్లిదండ్రులలో ఒక్కరూ చనిపోయిన వారికి నెలకు 500 రూపాయలు చెప్పున ఇస్తుంది. టీడీపీ 2014 లో అబద్ధపు పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క పథకం అమలు చేయలేదు. అయితే ఈ రోజు టీడీపీ మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. టీడీపీ నిద్ర లేస్తే జగన్ ను విమర్శించడానికి ప్రెస్ మీట్స్ పెడుతున్నారు అని తెలిపారు. నవరత్నాలను నకిలీ రత్నాలు అంటున్నారు టీడీపీ వారు… గాడిదికి ఏమి తెలుసు గంధపు చెక్క వాసన అని పేర్కొన్నారు. అలాగే మేము అని ఎన్నికల్లో గెలిచాం.2024 లో మేము మళ్ళీ గెలుస్తాం అని స్పష్టం చేసారు.
టీడీపీకి నిద్ర లేస్తే అదొక్కటే పని : ఎమ్మెల్యే కాకాని
Show comments