Site icon NTV Telugu

చంద్రబాబు రాబందులా… లోకేష్ కాకిలా తయారయ్యారు

కరోనా తగ్గుతున్న వేళ చంద్రబాబు నాయుడు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారా ఆ విషయాన్ని రాజకీయం చేయాలా అని తండ్రి కొడుకులు ఆలోచిస్తారు. చంద్రబాబు రాబందులా… చనిపోయిన వారికి పెట్టే పిండం తినడానికి వచ్చే కాకిలా లోకేష్ తయారయ్యారు అని తెలిపారు. డాక్టర్ సుధాకర్ విషయంలో చంద్రబాబు అతని తనయుడు రాజకీయ కుట్రలు చేశారని అందరికీ తెలుసు. కుట్రలో చిక్కుకున్నానని డాక్టర్ సుధాకర్ అప్పుడే చెప్పారు. దళితుల పట్ల టీడీపీ అధినేతకు, ఆపార్టీ నాయకులకు ఉన్న గౌరవం ఏ పాటిదో అందరికీ తెలుసు. జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు అర్హత లోకేష్ కు లేదు తలిపిన ఆయన శత్రువు కూడా ప్రశంసించే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.

Exit mobile version