ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో జోరుగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరిగేర వద్ద పేకాట స్థావరంపై కర్ణాటక పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన 19 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో పలువురు వైసీపీ నేతలతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ కూడా ఉన్నాడు. అతడు వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుతోంది.
కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో హిందూపూరం మండల వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కాగా హీరో బాలయ్య పీఏ అరెస్ట్ కావడం ప్రస్తుతం హిందూపురం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. అందులోనూ అతడు వైసీపీ నేతలతో పేకాట ఆడుతుండటం చర్చనీయాంశంగా మారింది. బాలయ్య కార్యక్రమాలతో పాటు హిందూపురంలో వ్యవహారాలన్నీ బాలాజీనే చూస్తాడని.. అతడు వైసీపీ నేతలతో అంటకాగడం ఏంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
