Physical harassment: ఆడ పిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు కామాంధులు.. ఇక, కొన్ని ఘటనల్లో శీలానికి కుల పెద్దలు, గ్రామ పెద్దలు వెలకట్టిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.. ఐదుగురు యువకులు.. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేశారు.. బాధితురాలి కుటుంబానికి డబ్బులు ఇచ్చి తప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.. కానీ, మనసు అంగీకరించక బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన బయటపడింది.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాట్రేనికోన మండలం చిర్రయానాం గ్రామంలో మైనరు బాలికపై ఈ నెల 6వ తేదీన సామూహిక అత్యాచారం జరిగింది.. మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లిన యువకులు.. ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.. ఒకరితర్వాత ఒకరు ఇలా ఐదుగురు యువకులు కలిసి ఆ బాలికపై పడి తమ పశువాంఛ తీర్చుకున్నట్టు తెలుస్తోంది.. ఇక, ఈ విషయం బైటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు అధికార పార్టీ నాయకులు.. బాధితురాలు కుటుంబానికి డబ్బులు ఇచ్చి తప్పు కప్పిపుచ్చే ప్రయత్నo చేశారు.. కానీ, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.. మరోవైపు.. అమలాపురం డీఎస్పీ మాదవరెడ్డి, ముమ్మిడివరం సీఐ జానకీరామ్ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. అయితే, బాలిక శీలానికి వెలకట్టి ఈ ఘటన వెలుగు చూడకుండా ప్రయత్నం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.