Site icon NTV Telugu

Palabhishekam to CM YS Jagan’s Photo: సీఎం జగన్‌ ఫొటోకి మంత్రుల పాలాభిషేకం..

Palabhishekam

Palabhishekam

Palabhishekam to CM YS Jagan’s Photo: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు బీసీ మంత్రులు.. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్‌ , మెరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరావు , మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. వైఎస్ స్ఫూర్తితో వైసీపీ అధికారంల్లోకి వచింది.. సీఎం జగన్ బీసీల ఆశయ సాధకుడని తెలిపారు.. 18 స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సింహ భాగం అంటే.. 11 స్థానాలు బీసీలకి, 3 స్థానాలు ఎస్సీ, ఎస్టీలకి ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.. ఈ సందర్భంగా పాలాభిషేకం చేసి సీఎం జగన్ ని స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.. గత ప్రభుత్వం మాటల్లో మాత్రమే బీసీలను న్యాయం చేస్తే.. సీఎం జగన్ చేతల్లో న్యాయం చేశారంటూ ప్రశంసలు కురిపించారు.

Read Also: Kangana Ranaut: బాలీవుడ్ మాఫియా.. వారికి అవార్డులు ఏంటీ..?

విద్య, వైద్యంలో ప్రజలు అభివృద్ధి చెందుతారని నమ్మే వ్యక్తి సీఎం జగన్‌ అని పేర్కొన్నారు మంత్రి బొత్స.. అయన క్యాబినెట్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ డిక్లరేషన్ చేసిన నాయకుడు జగన్ అంటూ గుర్తుచేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇక, సామజిక అసమానతను దూరం చేసిన నాయకుడు సీఎం జగన్‌… చంద్రబాబు దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా? అంటూ అవమాన పరిచాడు.. కానీ, సీఎం జగన్‌.. గ్రామ స్థాయి నుండి అనేక పదవుల్లో మెజారిటీ పదవులు అణగారిన వారికి ఇచ్చారు. రాజకీయ ప్రాధాన్యత కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి మేరుగ నాగార్జున..

Read Also: IPhone : హౌరా.. పాత ఐఫోన్‌కు 57 లక్షలా..? ఎందుకంత డిమాండ్‌..

మరోవైపు.. దేశ చరిత్రలో సీఎం జగన్ చిర స్థాయిలో నిలిచిపోతారు అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి జోగి రమేష్‌.. కనీసం వార్డు పదవుల్లో కూడా లేని మా కులం వారికి ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభలో అనేక పదవులు ఇచ్చారు.. ప్రజలు అందరూ.. అణగారిన వర్గాలు జగన్ కి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పార్టీని బంగాళాఖాతాంలో కలపాలని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్‌. ఇక, గతంలో చంద్రబాబు పదవులని అమ్ముకున్నాడు అని ఆరోపించారు మంత్రి కారుమూరి నాగేశ్వరావు.. చెప్పిన మాట నెలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 85 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేశాడన్న ఆయన.. బీసీలు అందరం జగన్ వెంటే ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంక్ గా చూశారు.. కానీ, సీఎం జగన్‌ వారికి బ్యాక్‌ బోన్‌గా ఉన్నారని పేర్రకొన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

Exit mobile version