Site icon NTV Telugu

Minister Vidadala Rajini: అధికారం లేనప్పుడే టీడీపీకి బీసీలపై ప్రేమ

Vidadala Rajini

Vidadala Rajini

విజయవాడలో నిన్న జయహో బీసీ సభలో తొక్కిసలాటలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు మంత్రులు జోగి రమేష్, విడదల రజని. ఎన్నికల సమయంలో,అధికారం కోసం మాత్రమే టీడీపీకి బీసీలు గుర్తుకువస్తారన్నారు మంత్రులు జోగి రమేష్, విడదల రజిని. జయహో బీసీ సభ సక్సస్ కావడంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.బీసీల సభ పెట్టడం టీడీపీకి ఇష్టం లేదా..?ఎక్కువ మంది రావడం వల్లే తొక్కిసలాట జరిగింది.బీసీలుగా సభ నిర్వహించుకోవడం కొంత మందికి నచ్చడం లేదు.

జయహో బీసీ సభను వెకిలి చేష్టలతో అవమానిస్తారా..?బీసీలను హేళన చేసి ఏం మెసేజ్ ఇద్దామని టీడీపీ అనుకుంటోంది.చంద్రబాబు మీద ప్రేమ ఉంటే వేరేలా చూడాలి కానీ ఇలా అవమానకర రీతిలో చూడొద్దని హెచ్చరిస్తున్నామన్నారు మంత్రి జోగి రమేష్. జయహో బీసీ సభకు వచ్చి గాయపడిన వారికి చికిత్స అందుతుంది .ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు మరో మంత్రి విడదల రజిని. వైసీపీ పూర్తిగా బాధితులకు అండగా ఉంటుంది. సీఎం మీద ఉన్న ప్రేమతో సభకు వచ్చామని చెప్పారు. టీడీపీ నేతలకు బురద జల్లే రాజకీయం అలవాటైంది. బీసీల గురించి టీడీపీకి ఏ మాత్రం పట్టదు. అధికారంలో ఉన్నప్పుడే టీడీపీకి మహిళలు, బీసీలు గుర్తుకొస్తారా..? అని ఆమె మండిపడ్డారు.

Read Also: Rohit Sharma: అప్పుడు ధోనీ.. ఇప్పుడు రోహిత్.. అత్యంత చెత్త రికార్డ్

బెజవాడలో బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడింది. జయహో బీసీ నినాదం.. విజయవాడలో హోరెత్తింది. చిత్తూరు నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్ని జిల్లాల నుంచి దాదాపు 85 వేల మంది బీసీ ప్రతినిధులు ఈ సభకు హాజరై జయహో బీసీ- జయహో జగనన్న అంటూ నినదించారు. గ్రామ పంచాయతీలోని వార్డు స్థాయి సభ్యుడి నుంచి రాజ్యసభ సభ్యుల వరకూ సుమారు 85 వేల మంది ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. జయహో బీసీ- జై జగన్, జయహో జగన్.. అన్న నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, గ్రామ స్థాయి వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు వరకు వివిధ పదవుల్లో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version