NTV Telugu Site icon

Venugopala Krishna: పిల్లి సుభాష్‌కు మంత్రి వేణు కౌంటర్.. ఎవరి ట్రాప్‌లోనో పడి..

Venu Counter To Pilli

Venu Counter To Pilli

Minister Venugopala Krishna Strong Counter To Pilli Subhash Chandrabose: 2024 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి వేణుని అభ్యర్థిగా ప్రకటిస్తే తాను మద్దతు ఇవ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ట్ర తాజాగా కౌంటర్ ఇచ్చారు. బోస్ ఎవరి ట్రాప్‌లోనే పడి అలా మాట్లాడుతున్నారని తాను అనుకుంటున్నానని అన్నారు. బోస్‌తో ఉన్నవాళ్లే ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. బోస్ అలా మాట్లాడి ఉండకూడదని, అలా మాట్లాడరని తాను అనుకుంటున్నానని చెప్పారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ ఆయన్ను గౌరవించిందన్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పరోక్షంగా బోస్‌ని హెచ్చరించారు. పార్టీ అన్ని విషయాలూ పరిశీలిస్తోందని.. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan: సీఎం జగన్.. ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పండి

అంతకుముందు ఆత్మీయ సమావేశంలోనూ మంత్రి వేణు కీలక వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దు అవ్వదని తెలిసి, బోస్‌ను మంత్రిగా కంటిన్యూ అవుతావా? అని జగన్ అడిగారన్నారు. అయితే.. తాను రాజ్యసభకు వెళ్తానని బోస్ చెప్పారన్నారు. అనుచరులు వల్లే బోస్‌కి అపకీర్తి, మచ్చ వస్తోందని ఆరోపించారు. పార్టీకి నష్టం చేసే వాళ్ళని కచ్చితంగా దూరం పెడతానన్నారు. తల్లి లాంటి పార్టీను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బోస్ ఓడిపోయినప్పటికీ పార్టీ వదల్లేదని.. జగన్ ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ పదవుల్ని ఇచ్చారని గుర్తు చేశారు. తోట త్రిమూర్తులు, బోస్ ముందే వచ్చే ఎన్నికల్లో వేణు పోటీ చేస్తారని జగన్ చెప్పారన్నారు. తనకు, పిల్లికి, తోట త్రిమూర్తులకు వైఎస్ జగన్ ఎవరికి ఇవ్వాలని బాధ్యతలు వారికి ఇచ్చారన్నారు. తాను కేవలం 2024లోనే కాదు.. 2029, 2034లలో కూడా పోటీ చేస్తానని ఉద్ఘాటించారు.

Cab Driver: క్యాబ్‌ డ్రైవర్ పాడుపని.. డ్రైవింగ్ చేస్తూ మహిళ కళ్లెదుటే హస్తప్రయోగం

ఇదిలావుండగా.. 2024 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి వేణు అభ్యర్థి అయితే, తాను సమర్థించనని పిల్లి సుభాష్ కుండబద్దలు కొట్టారు. వేణు బరిలో ఉంటే మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. తన కుటుంబంలో నుంచే ఎవరో ఒకరు పోటీ చేయాలని క్యాడర్ కోరుతోందని అన్నారు. తనకు క్యాడరే ముఖ్యమని, ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. వేణు ఆత్మీయ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు. సమయం వచ్చినప్పుడు క్యాడర్ సమాధానం చెప్తుందన్నారు. క్యాడర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనన్నారు. పార్టీకి నష్టమైనా, తప్పడం లేదన్నారు.

Show comments