NTV Telugu Site icon

Minister Venugopala Krishna: చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. చంద్రబాబు సైకోలా మారాడు..!

Minister Venugopala Krishna

Minister Venugopala Krishna

Minister Venugopala Krishna: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది, అందుకే ప్రజలు విస్మరించారని వ్యాఖ్యానించారు.. అయితే, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. కానీ, వాటిని గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు నువ్వు పాల్పడుతున్నావు అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ప్రతిపక్ష పార్టీని ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. మరోవైపు, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.. కానీ, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తే మాత్రం కుదరని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి వేణుగోపాల కృష్ణ.

Read Also: Akhil Akkineni: ‘ఏజెంట్’ సైలెన్స్ ‘వయోలెన్స్’ని డిఫైన్ చేస్తుంది…

మరోవైపు.. టీడీపీ హయాంలో చంద్రబాబు ఒక రాజ్యానికి రాజులా ప్రవర్తించాడని గతంలో ఆరోపించారు మంత్రి వేణు.. అమరావతి రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. రైతులు నష్టపోయారంటే అది చంద్రబాబు వల్లేనని అన్నారు. ప్రజస్వామ్యంపై నమ్మకం కోల్పోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. చంద్రబాబు తన ప్రచార యావ, ఆర్బాటం వల్ల రాష్ట్రంలో 11 మంది అమాయకులు చనియారన్నారు.. ఈ రాష్ట్రానికి చంద్రబాబు శాపంగా మారారంటూ గతంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలుచేసిన విషయం విదితమే.

Show comments