Site icon NTV Telugu

Vellampalli: సంతృప్తికరంగా పని చేశా.. మంత్రులను మారుస్తామని అప్పుడే చెప్పారు..

ఈ మూడేళ్లలో సంతృప్తికరంగా పని చేశాను.. సీఎం, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఏ పని ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌… ఇవాళే ఏపీలో పాత మంత్రులంతా రాజీనామా చేస్తారని తెలుస్తోన్న తరుణంలో.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే 90 శాతం మంత్రులను మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారని.. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న ఆయన.. ఈ మూడేళ్లలో సంతృప్తికరంగా పని చేశాను.. సీఎం జగన్‌ ఇచ్చిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించటమే నా కర్తవ్యం అని.. అది పార్టీ బాధ్యతనా, ప్రభుత్వంలో కొనసాగింపు ఉంటుందా అన్నది ముఖ్యమంత్రి నిర్ణయమే అన్నారు.. ఇక, ప్రభుత్వం ఎటువంటి ఆరోపణలు చేయలేక రాజకీయ పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాయని మండిపడ్డ మంత్రి వెల్లంపల్లి.. వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగాం అన్నారు.

Read Also: TRS vs BJP: కేంద్రానికి పక్షపాత వైఖరి.. సాక్షాలు ఇవిగో…!

Exit mobile version