Minister Subhash : మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, సవాళ్లపై మంత్రి సుభాష్ ఘాటుగా స్పందించారు. ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ వేణుగోపాల్ శ్రీనివాస్ తన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి 2023లో తెచ్చిన మెమోలో శెట్టిబలిజలను ‘గౌడ’గా చూపిస్తూ ‘ఉపకులం’గా వర్గీకరించిన విషయాన్ని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. “ఈ మెమో అసలు ఎందుకు తెచ్చారు? అధికారులు ఇచ్చారు, నాకు తెలియదు అని చెప్పడం మీకే సిగ్గుగా ఉండాలి” అని ఆయన విమర్శించారు.
రాష్ట్రాలు విడిపోయాక శెట్టిబలిజలను ఓసీ కేటగిరీకి మార్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, “2014-19 మధ్యలో టిడిపి ప్రభుత్వం శెట్టిబలిజ, గౌడ, శ్రీసేన, యాద సమూహాలకోసం కార్పొరేషన్ పెట్టింది. కానీ గీత ఉపకులాల విషయానికి వస్తే పూర్తిగా విస్మరించారు” అని మంత్రి ఆరోపించారు. మాజీ మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ గీత ఉపకులాల తరపున ఏమీ చేయలేదని మంత్రి సుభాష్ మండిపడ్డారు. “వేషధారణ చేసారు తప్ప గీత ఉపకులాల పరిస్థితి మార్చడానికి ఏ చర్యా తీసుకోలేదు. పట్టించుకోలేదు కూడా” అని అన్నారు.
అంతేకాకుండా.. “బిసి కార్పొరేషన్ లోన్‌ను మీ కాలంలోనే తీసేసారు. ఇప్పుడు మా మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం” అని మంత్రి వ్యాఖ్యానించారు. కులాల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారని వేణుగోపాల్ చేసిన ఆక్షేపణలపై మంత్రి సుభాష్ తీవ్రంగా ఖండించారు. “కులానికి క్షమాపణ చెప్పాల్సింది నేను కాదు, మీరు. కోటు, కర్ర పెట్టుకుని చేసే మీ డ్రామాలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు” అని ఆయన స్పష్టం చేశారు. “మీరు ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లకు నిధులు ఇవ్వలేదు. ఖాళీ పేర్లుగా మాత్రమే ఉంచారు” అని మంత్రి సుభాష్ విమర్శించారు.
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా!
