NTV Telugu Site icon

Seediri Appalaraju: పవన్ కళ్యాణ్‌పై మంత్రి సీదిరి సెటైర్లు.. సీఎం పదవి ముష్టి అడిగితే వచ్చేది కాదు

Minister Seediri Satires Pa

Minister Seediri Satires Pa

Minister Seediri Appalaraju Satires On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇవ్వాలి తప్ప, ముష్టి అడిగితే వచ్చేది కాదని కౌంటర్ వేశారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. తాను అసెంబ్లీకి వెళ్లడానికి ఎవరు ఆపుతారంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారని.. ఇంతకీ పవన్ తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు తిరుగుతున్నాడా? లేక తన ఎమ్మెల్యేల్ని గెలిపించేందుకా? అనే క్లారిటీ లేదని దుయ్యబట్టారు. అసలు పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో డిసైడ్ కావాలని చురకలంటించారు. వారాహి యాత్ర అసంబద్దమైన‌ యాత్ర అని విమర్శించారు. చెప్పుల గురించి మాట్లాడుతున్న పవన్.. తన పార్టీ గుర్తు గురించి మాట్లాడాలన్నారు. చెప్పులు మర్చిపొతే తెచ్చుకోవచ్చు కానీ.. పార్టీ గుర్తు పోతే ఎలా? అని ప్రశ్నించారు. ముందు మీ పార్టీ గుర్తు పోయిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పవన్‌ని సూచించారు. పార్టీ గుర్తు ఎక్కడుండో, ఎలక్షన్ కమీషన్ ఎవరికి కేటాయించిందో తెలుసుకోవాలని చెప్పారు. పవన్ ముందు తన గుర్తు ఎక్కడుందో వెతుక్కోవాలన్నారు.

Murder: జీతం వివాదంలో దారుణంగా హత్య చేసిన యజమాని.. కాన్పూర్ లో ఘటన

2014, 2019లో‌ కూడా టీడీజీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పని చేశాయని.. తెరముందు నాటకాలు, తెరవెనుక అంతా కలిసే సంసారం చేస్తున్నారని మంత్రి సీదిరి మండిపడ్డారు. 2019లో భీమవరి, గాజువాక నియోజకవర్గాల్లో వైసీపీ కసిగా ఓడించిందని పవన్ మట్లాడుతున్నారని.. ఈ లెక్కన టీడీపీ 2019లో జనసేనకు సహకరించిందా? అని నిలదీశారు. వైసీపీ ఓడించిందని చెప్తున్నారంటే.. మిగిలిన పార్టీలు కలిసి పనిచేసినట్లే‌ కదా! అని అడిగారు. 2024 ఎన్నికల్లోనూ ఏ మార్పు ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ముందు నుంచే సీఎం జగన్ ఒకటే చెప్తున్నారని.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అన్ని చోట్లా పోటీలో ఉంటామని చెప్పారు. తనని సీఎం చేయాలని కోరుతున్న పవన్.. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు? అని నిలదీశారు. ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రం మొత్తం పోటీ చేయాలని, కేవలం 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సీఎం కాలేరని పవన్‌కి కౌంటర్ ఇచ్చారు.

Somu Veerraju: చంద్రబాబు, లోకేష్‌పై సోము వీర్రాజు ఫైర్.. అలా ఎలా హామీలిస్తున్నారు?