Site icon NTV Telugu

Minister Roja: చంద్రబాబు, లోకేష్‌కు 70ఎంఎంలో సినిమా గ్యారంటీ

Minister Roja Min

Minister Roja Min

కర్నూలు జిల్లా పర్యటనలో ఓర్వకల్లులోని రాక్ గార్డెన్‌ను మంత్రి రోజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం, పిక్నిక్ స్థలాలు, వసతి కోసం హరిత రిసార్టు పర్యాటకులకు అందిస్తున్నామన్నారు. ఇది పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. మరోవైపు ప్రతిపక్షం టీడీపీపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పచ్చకామెర్లు ఉన్నాయని.. అందుకే ఆయనకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందని రోజా సెటైర్ వేశారు. చంద్రబాబు చేసిన వెధవ పనులు జగన్ పాలనలో ఉన్నాయంటూ ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటు అని మంత్రి రోజా మండిపడ్డారు.

Alapati raja: అన్నదాతల ఆగ్రహానికి జగన్ బలి కాక తప్పదు

చంద్రబాబు ప్రచారానికి ప్రజల్లో స్పందన లేదని మంత్రి రోజా ఆరోపించారు. నిత్యావసరాల ధరలు ఏపీలో మాత్రమే పెరగలేదని.. దేశమంతా పెరిగినట్లు ఆమె గుర్తుచేశారు. దేశంలో ధరల పెంపుపై మోదీని ఎందుకు తిట్టడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా మీడియాతో దొంగచాటుగా మాట్లాడుతున్నారని మంత్రి రోజా విమర్శలు చేశారు. తాము ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నామని.. అంత ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్‌కు వచ్చే ఎన్నికల్లో జగన్ 70ఎంఎంలో సినిమా చూపించడం గ్యారంటీ అని మంత్రి రోజా హెచ్చరించారు.

 

Exit mobile version