NTV Telugu Site icon

Minister Roja: మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం

Rojanew

Rojanew

మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆర్ కె రోజా బిజీ అయిపోయారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె పర్యటించారు. అక్కడ బాస్కెట్ బాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. తాజాగా విజయవాడలో ఆమె శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడాప్రాంగణములో శిక్షణా శిబిరాలను ప్రారంభించి ప్రసంగించారు.

కరోనా వల్ల రెండు ఏళ్లు క్రీడాకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. క్రీడలు ఆరోగ్యాన్ని, అవార్డులను తెచ్చి పెడతాయి. 48 విభాగాల్లో ఈ వేసవిలో క్రీడలను ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో 1670 సమ్మర్ క్యాంపులను ప్రారంభిస్తున్నాం అన్నారు. ఈ శిబిరాల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం. వైస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఎక్కడైనా క్రీడా ప్రాంగణాలు అక్రమణలకు గురై ఉంటే వాటిని సంరక్షించి, క్రీడా ప్రాంగాణలుగా అభివృద్ధి చేస్తాం అని చెప్పారు మంత్రి రోజా.

అనంతరం రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొన్నారు. కేబీఎన్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు మంత్రి రోజా. 500 మందికి పైగా ఇక్కడ రక్తదానం చెయ్యటం గొప్ప విషయం. ఈనాటి యువత సమాజం పట్ల సేవాభావంతో ఉండటం మంచి విషయం. ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుంది. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలి. కోవిడ్ సమయంలో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపేది యువతే అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. యువతకు ఆయన అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు రోజా.
Rain Effect : వరుణుడి ధాటికి.. రైతన్న విలవిల