Site icon NTV Telugu

Minister Roja: పవన్ డైమండ్ రాణి కామెంట్స్.. రోజా ఏమన్నారంటే?

Roja14

Roja14

ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. పొత్తు పొడుపులు.. విమర్శలు.. పెదవి విరుపులు.. విమర్శలు.. ఇవే ఏపీలో నడుస్తున్నాయి. మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ డైమండ్ రాణి మాటకు రోజా కౌంటర్‌ వేశారు. అది కూడా మామూలుగా కాదు.. కాస్త వెటకారంగా. పవన్ కల్యాణ్ పొలిటికల్‌ జోకర్ అనేశారు రోజా సెల్వమణి. జగన్ లా నేను పోటీ చేయలేను.. నాకు చేత కాదు అని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడన్నారు. అదీ జగన్ పవరంటే అన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేనని నిస్సహాయత వ్యక్తం చేశారన్నారు.

Read Also:Astrology: జనవరి 14, శనివారం దినఫలాలు

సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య కలెక్షన్లు వచ్చాయి… బాలయ్య వీరసింహారెడ్డి కలెక్షన్లు వచ్చాయి…పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నుండి కలెక్షన్లు అందాయి…కాని జనసేన నాయకులే ఎమీ లేకుండా పోయింది. సిఎం జగన్ పరిపాలనలో రైతులందరికి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. మంత్రిగా తొలి సంక్రాంతి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏపీని అన్ని రంగాలలో జగన్ అభివృద్ధి చేస్తున్నారని, ఏపీని దూసుకుపోతుందన్నారు. ప్రతిపక్ష ఏమి చేయాలో తెలియకుండా పిచ్చిపట్టి సిఎం జగన్…మంత్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు చెత్త ఆలోచనలను భోగి మంటల్లో వేయాలన్నారు మంత్రి రోజా. ఎన్టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Shobhan Babu: అన్నకు తగ్గ అందాల తమ్ముడు!

Exit mobile version