Site icon NTV Telugu

Minister RK Roja: అది అమరావతి యాత్ర కాదు.. అత్యాశ యాత్ర

Minister Roja

Minister Roja

అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్ర ఒకవైపు కొనసాగుతుంటే.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు యాత్రపై విమర్శల దాడి కొనసాగిస్తూనే వున్నారు. తాజాగా మంత్రి రోజా అమరావతి యాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలలో మంత్రి రోజా మాట్లాడుతూ.. .మూడు ప్రాంతాల అభివృద్ది కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. 26 గ్రామాల కోసం 26 జిల్లాలను ఫణ్ణంగా పెట్టలేం అన్నారు. చంద్రబాబుకి అమరావతిపై ప్రేమ వుంటే ఐదేళ్ళ కాలంలో ఎందుకు అభివృద్ది చెయ్యలేదని ఆమె ప్రశ్నించారు.

ప్రశాంత నగరంలో గొడవలు సృష్టించి..రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు.మూడు రాజధానులు ఏర్పాటుతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చెయ్యాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు.టీడీపీ మద్దతుతోనే ఉత్తరాంధ్రలో రైతులు పాదయాత్ర చేస్తున్నారని..పాదయాత్రలో తొడలు గొట్టి…మీసాలు దువ్వుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు నిద్రలేచి ట్వీట్ ల ద్వారా ఏదో ఒక్క యాగీ చేస్తావుంటాడని..ఉత్తరాంధ్రలో ప్రజలు వలస పోతున్నారంటు ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి రోజా అన్నారు. గతంలో ఆయన మిత్రపక్షంగా వున్నప్పుడు ప్రజలు వలసపోలేదా అన్ని పవన్ కళ్యాణ్ పై రోజా మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాకా ఉత్తరాంధ్రను ఎంతో అభివృద్ధి చేసాడని…రోజుకొక్క మాట…పూటకొక్క వేషం వేస్తూ తిరిగితే పవన్ కళ్యాణ్ ను ప్రజలు కొట్టే రోజూ త్వరలోనే వస్తుందని రోజా అన్నారు.

శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రోజా వీఐసీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమరావతి వాళ్ళది రాజధాని యాత్ర కాదు…అత్యాశ యాత్ర అని మండిపడ్డారు. వైజాగ్ ప్రజలను రెచ్చగోట్టడానికే అమరావతి రైతులు అటు వైపు పాదయాత్ర చేస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్లు అవగాహనరాహిత్యంతో చేస్తున్నవే అని ఆమె ఎద్దేవా చేశారు. ఇదిలా వుంటే.. వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూనే వున్నాయి.

Read Also: Pawan Kalyan: దేనికీ గర్జనలు? పవన్ పవర్ పంచ్ లు

రాజధానిపై రెఫరెండం కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు మంత్రి అమర్‌నాథ్. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ప్రస్తావించారు.. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసింది టీఆర్ఎస్‌.. కానీ, కాంగ్రెస్‌ కాదన్నారు.. అయితే, ఎన్నికలకు సరదా ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.. ఈ సమయంలో రాజీనామాలు చేయాల్సిన అవసరం లేనప్పటికీ ప్రజాభిప్రాయం తెలియజేయడానికి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన ఉంటుందన్నారు మంత్రి అమర్‌నాథ్.. ఎల్.ఐ.సీ. కూడలి నుంచి చేపట్టే భారీ ప్రదర్శనలో అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగడతాం అన్నారు.

Read Also: Munugode Bypoll: మునుగోడులో టీడీపీ ఎంట్రీ.. పోటీపై త్వరలో క్లారిటీ..

Exit mobile version