Minister Roja: రాజమండ్రిలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని.. చంద్రబాబు ఫోటో వేయలేదని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి నందమూరి ఫ్యామిలీలో చంద్రబాబు విలువేంటో తెలిసిపోతుందని చురకలు అంటించారు.
Read Also: Plastic Ban: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్లు రద్దు
మరోవైపు కుప్పంలో చంద్రబాబు కోట కోట కూలిపోతోందని మంత్రి రోజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిచ్చాసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని.. అందుకే పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నాడని రోజా మండిపడ్డారు. సీఎం జగన్ ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం బటన్ నొక్కినా.. ఏదో ఒక రాద్దాంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చేందుకు కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. మొన్నటి వరకు ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారని.. ఇప్పుడు కుప్పంలో అల్లర్లు సృష్టించి ఆ బురదను తమపై చల్లేందుకు ఆరోపణలు చేస్తున్నారని రోజా విమర్శించారు.
