Minister RK Roja Visited K Viswanath Family Members: కళాతపస్వి కే విశ్వనాథ్ ఇటీవల పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి రోజా ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. విశ్వనాథ్ భార్య, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆమె.. విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌పై ప్రశంసలు కురిపించారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని.. తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి, కల్చర్‌కు చేసిన సేవ ఇంకెవరూ చేయలేరేమో అనిపిస్తుందని అన్నారు.
Pakistan: కుడి చేతిలో ఖురాన్..ఎడమ చేతిలో అణుబాంబు.. ఆర్థిక సంక్షోభానికి పాక్ నాయకుడి పరిష్కారం
మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘‘విశ్వనాథ్ లేరని ఊహించుకోవడమే కష్టంగా ఉంది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి, సంస్కృతికి చేసిన సేవలు ఇంకెవరూ చేసి ఉండరు. తన సినిమాల్లో ఆయన తెలుగుదనం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారు. ఆయన సినిమాలు ఒక మెసేజ్‌ని అందించి, వాటిని ముందుకు తీసుకువెళ్లేలా ఉంటాయి. ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా ఆయన ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు. తనని చూసి ఆదర్శవంతంగా ఎలా జీవించాలో నేర్చుకునేలా ఆయన జీవించారు. ఆయన క్రమశిక్షణతో ఉండటంతో పాటు ప్రతీ పని టైం టు టైం చేసేవారని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. తెర మీద ఆయన కనిపించరు కానీ ఆయన పద్ధతులు కనిపిస్తాయి, క్రమశిక్షణ కనిపిస్తుంది, ఒక టీచర్‌ను చూసినట్టు భయం వేస్తుంది. నిజంగా ఆయన జీవితం పరిపూర్ణంగా అనుభవించారు’’ అని చెప్పుకొచ్చారు.
Kodali Nani: ఆ గుట్టు తేలాలి.. మోడీకి, కేసీఆర్‌కి లేఖ రాస్తా
విశ్వనాథ్ ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకోవాలని రోజా కోరారు. తెలుగు నెల ఉన్నంత వరకు.. తెలుగు వారంతా అభిమానించే విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవను గుర్తించి.. ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయనకి ఉన్న పేరు, అభిమానుల గురించి తెలుసుకొని.. కుటుంబ సభ్యులు షాక్ అవుతున్నారని పేర్కొన్నారు.
Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్
