Minister RK Roja: వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు మంత్రి ఆర్కే రోజా.. అసలు వైసీపీ నేతలపై ఎందుకు చీపుర్లు వాడాలని ఆమె ప్రశ్నించారు.. అమ్మఒడి, చేదోడు, ఆసరా వంటి వాగ్దానాలు నెరవేర్చినందుకు? వైసీపీ నేతలపై చీపుర్లు వాడాలా? ఆదర్శప్రాయమైన విద్యా విధానాలు మరియు పథకాలు అమలు చేస్తున్నందుకు చీపుర్లతో కొట్టాలా? డ్వాక్రా రుణాలపై టీడీపీ వైఫల్యాలను బయటపెట్టినందుకా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. డ్వాక్రా రుణాల రూ.24,000 కోట్ల (సూత్రం + వడ్డీ) మాఫీ చేస్తున్న వైఎస్ జగన్మోహన్‌ఱెడ్డి ప్రభుత్వం అని మీరు తెలుసుకోవాలని లోకేష్‌కు చూపించారు రోజా.. అసలు ఇప్పుడు చెప్పండి ప్రజా తిరుగుబాటు జరగాల్సింది టీడీపీపైనా, వైసీపీపైనా ? అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు మంత్రి ఆర్కే రోజా..
Read Also: Nirmala Sitharaman: సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు.. తేల్చేసిన నిర్మలాసీతారామన్
కాగా, యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న నారా లోకేష్.. చిత్తూరులోని అమరరాజా ప్రాంగణంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ సంపూర్ణ మద్యనిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాం అన్నాడు. నాలుగేళ్లైనా మద్య నిషేధం చేయకుండా… కల్తీ మద్యంతో బినామీలతో వ్యాపారం చేస్తున్నాడు. 45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నాడు. ఉన్న పెన్షన్లు పీకేస్తున్నాడు. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రూ.15 వేలు ఇస్తానన్నారు. ఒక్కరికే పరిమితం చేసి రూ.13 వేలు ఇస్తున్నాడు. డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులు పక్కదారి పట్టించారంటూ విమర్శలు గుప్పించిన విషయం విదితమే..