తెలంగాణ మంత్రి కేటీఆర్ అభివృద్ధిపై మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అప్పటి నుంచి కేటీఆర్‌పై కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నారా లోకేష్.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలకు మీడియాతో పాటు నారా లోకేష్ కూడా వక్రీకరించారని మండిపడ్డారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఆయన పక్క రాష్ట్రాలు అన్నారు.. గానీ, ఆంధ్రప్రదేశ్ అని అనలేదని.. ఒక వేళ ఆంధ్ర రాష్ట్రాన్ని అని ఉంటే టూరిజం శాఖ మంత్రిగా కేటీఆర్‌ను సాదరంగా ఆంధ్రకు ఆహ్వానిస్తున్నా.. ఇక్కడి రోడ్లు, వసతులను నేనే దగ్గరుండి చూపిస్తానని స్పష్టం చేశారు.
Read Also: Tarsame Singh Saini: చికిత్స ఆలస్యం.. ప్రముఖ సింగర్ మృతి
మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న బురదజల్లుడు కార్యక్రమాలన్నింటి వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని ఆరోపించారు మంత్రి ఆర్కే రోజా.. ఇందులో భాగంగానే పేపర్ లీక్ అంశంలో కూడా టీడీపీ నాయకులే అరెస్ట్ అవుతున్నారన్నారు. ఇక, మహిళలు దిశా యాప్ వాడితే ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా నివారించవచ్చు అన్నారు మంత్రి ఆర్కే రోజా.. దిశ స్ఫూర్తితో రమ్య కేసులో నిందితులకు శిక్ష పడింది. దేశంలో ఎవరూ చేయని విధంగా నిందితులకు ఉరిశిక్ష వేయించి జగనన్న ప్రభుత్వం అందరితో శభాష్ అనిపించుకుందని ప్రశంసలు కురిపించారు మంత్రి రోజా.