Site icon NTV Telugu

Minister RK Roja: మరోసారి నగరిలో రచ్చకెక్కిన విబేధాలు.. ఇలా స్పందించిన మంత్రి రోజా

Minister Rk Roja

Minister Rk Roja

నగరిలో మరోసారి అధికార పార్టీ విబేధాలు రచ్చకెక్కాయి… మంత్రి ఆర్కే రోజా అనుచరులు వ్యతిరేకవర్గానికి చెందిన జెడ్పీటీసీ మురళీధర్‌రెడ్డిపై దాడి చేశారు రోజా అనుచరులు.. వడమాలపేట మండలం పత్తిపుత్తూతులో గ్రామ సచివాలయాన్ని రోజా ప్రారంభించాల్సిన సమయానికి ముందు.. సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదంటూ తాళంవేసి నిరసన వ్యక్తం చేశారు.. అయితే, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి రోజా అనుచరులు కావాలనే ఇలా చేస్తున్నావు అంటూ మురళీధర్‌రెడ్డిపై దాడి చేశారు.. మురళీధర్ రెడ్డిని పక్కకు లాగేసి సచివాలయ తాళాన్ని పగలగొట్టి గేటు తెరిచారు. గొడవ నేపథ్యంలో జెడ్పీటీసీ మురళీధర్‌ను స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

Read Also: Pawan Kalyan in Vizag RK Beach: తొలిప్రేమ సీన్ రిపీట్.. ఒంటరిగా పవన్ బీచ్ లో వాకింగ్

ఇక, ఆ తర్వాత సచివాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా.. ఈ విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వాళ్లు నా అన్నలే.. కుటుంబంలో విభేదాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.. అంతేకాదు.. వారి వెనుక ఎవరున్నారన్నది భగవంతుడికి తెలుసు అంటూ చమత్కరించారు.. వారికి పదవులు, గౌరవం ఇచ్చాను.. సంపాదించుకోవడానికి వర్క్‌లు ఇచ్చాను.. నేను అన్యాయం చేశానని చెప్పడం బాధాకరం అన్నారు.. ఎందుకు వారు గొడవలు చేస్తున్నారో వారి మనస్సాక్షికి తెలియాలంటూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగిన ఆమె.. నాకు ఎవరి మీద కోపం లేదు.. బెదిరించి బిల్లులు తీసుకొని మరీ మంజూరు కాలేదని చెబుతున్నారని మండిపడ్డారు. కాగా, జెడ్పీటీసి మురళీధర్ రెడ్డి నిరసన, అతడిపై రోజా అనుచరుల దాడి.. ఇలా మరోసారి అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే విభేదాలను రచ్చకెక్కించాయి.

Exit mobile version