Minister Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో తన నివాసం దగ్గర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా దర్బార్ కు స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఇక, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే ప్రజా సమస్యలు ఏర్పడ్డాయి.. రాబోయే రోజులలో గ్రామాలను సమస్యల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం.. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ఇక, రాష్ట్ర ప్రజల సమస్యలను త్వరలోనే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Minister Ramprasad Reddy: గత వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే ప్రజా సమస్యలు ఏర్పడ్డాయి..
- ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్.. గత వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే ప్రజా సమస్యలు ఏర్పడ్డాయి.. రాబోయే రోజులలో గ్రామాలను సమస్యల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం.. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Mandipalli