Site icon NTV Telugu

పెన్షన్ల కోసం రూ.18,000 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి పెద్దిరెడ్డి

పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఏడాదికి రూ.18,000వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు. టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో కేవలం 31లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అందేవని, కేవలం జన్మభూమి కమిటీలు సూచించిన వారికి మాత్రమే ఇచ్చేవారని మంత్రి విమర్శించారు.

Read Also: నీరా ఆరోగ్య ప్రదాయిని: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ఈ నెల నుంచి రాష్ర్ట వ్యాప్తంగా 63 లక్షలమందికి పెన్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పెన్షన్‌ ఇస్తున్నామని మంత్రి అన్నారు. పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. పేదలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నో సంక్షేమ పథకాలను జగన్‌ ప్రవేశపెట్టారన్నారు.

Exit mobile version