Site icon NTV Telugu

చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది !

Peddireddy

Peddireddy

తిరుపతి : జగన్ కు సమానంగా లోకేష్ ను తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు పిచ్చి ఆలోచన అని… గత ఎన్నికల కన్నా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవ చేసుకోవాలి..అదే మంచిదన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలోనే చంద్రబాబు మళ్లీ పోటీ చేయాలని కోరుకుంటున్నానని… జగన్ చేసిన అభివృద్ధి వల్లే కుప్పంలో భారీ విజయం సాధించామని వెల్లడించారు. గత పాలకులు ఎన్నో ఏళ్లుగా స్థానిక పోరు జరపకుండా నెట్టుకొచ్చారని… పార్టీల్లో గ్రూపులకు భయపడి చంద్రబాబు స్థానిక ఎన్నికలకు వెళ్ళలేదని విమర్శలు చేశారు. నాడు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సైతం చంద్రబాబుకు బంట్రోతుగా వ్యవహరించి ఎన్నికలు జరపలేదని మండిపడ్డారు..
అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి దేనని స్పష్టం చేశారు.

Exit mobile version