Minister Peddireddy: మే తొలివారం వరకు విద్యుత్ సమస్యలు ఇంతే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. బొగ్గు కొరత వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుత్ సమస్యలతో సతమతం అవుతున్నాయని తెలిపారు. ఏపీలో విద్యుత్ సమస్యలకు కూడా దేశంలోని బొగ్గు కొరత కారణమని వెల్లడించారు. అటు కరోనా సంక్షోభం, భారీ వర్షాలు బొగ్గు ఉత్పాదనను ప్రభావితం చేశాయని తెలిపారు. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం కూడా బొగ్గు లభ్యతపై పడిందని వివరించారు.
విద్యుత్ కొరత ఏర్పడటంతో బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఏర్పడిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనేక రాష్ట్రాలు బారులు తీరుతుండటంతో విద్యుత్ ధర అమాంతం పెరిగిపోయిందని చెప్పారు. అనేక రాష్ట్రాల బాటలోనే ఏపీలోనూ విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని వివరించారు. నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంట్‌లో 24 రోజులకు సరిపడా నిల్వలు ఉంచుకోవాలని.. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. అనేక రాష్ట్రాల్లోని థర్మల్ ప్లాంట్లలో చూస్తే రెండు నుంచి ఐదు రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఏపీలో విద్యుత్ కొరతను తాము అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మే తొలివారం నాటికి ఏపీలో విద్యుత్ సమస్యలు చక్కబడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
- YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
CM Jagan: 2024 ఎన్నికలపై ఫోకస్.. ఈనెల 27న వైసీపీ నేతలతో కీలక భేటీ
తాజావార్తలు
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!