Minister Peddireddy Ramachandra Reddy Review డిమాండ్ కు తగిన విధంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. విద్యుత్ శాఖ అధికారులుతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించే సీఎం విషయంలో అలసత్వం వహిస్తే సహించేంది లేదు. వసాయ కనెక్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులను రోజుల తరబడి పెండింగ్ లో పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Read Also: CM KCR: వైద్య రంగంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం
దీనికి సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరతాం అన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంటాం. ఎక్కడైనా రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదుల పై కఠినంగా చర్యలు తీసుకుంటాం. రానున్న వేసవిలో డిమాండ్ కు తగిన విధంగా విద్యుత్ సరఫరా జరగాలి. అందుకోసం ట్రాన్స్ కో తో డిస్కంలు సమన్వయం చేసుకోవాలి.రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కెవి స్టేషన్ల నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేయాలి. కొన్నిచోట్ల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇండోర్ సబ్ స్టేషన్ ల వల్ల ఎక్కువ వ్యయం అవుతోంది. అర్భన్ ప్రాంతాల్లో తప్పనిసరి అయితే మాత్రమే వాటిని ప్రతిపాదించాలి. రూరల్ ప్రాంతాల్లో ఇండోర్ స్టేషన్ల ను నిర్మించడానికి వీలులేదన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి.
వ్యవసాయ కనెక్షన్ల పై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాం.ఇందుకోసం రైతుల నుంచి ఆధార్ అప్ డేషన్, బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి.ఇంకా డిస్కంల పరిధిలో కొన్ని జిల్లాల నుంచి దీనిపై అలసత్వం కనిపిస్తోంది.ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని అధికారులను కోరారు.
Read Also: Flordelis Dos Santos: భర్తను చంపేందుకు 6సార్లు ప్లాన్.. కట్ చేస్తే..
