తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏపీలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలతో కొన్నిసార్లు విద్యుత్ పోవచ్చు.. కానీ, కోతలు లేవన్నారు.. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయని వెల్లడించారు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చు అని.. ఏపీలో బాగాలేదు.. తెలంగాణలో బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించి ఉండవచ్చు అంటూ విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: Anam Ramanarayana Reddy: మేం సిగ్గు పడుతున్నాం.. మీకు ఉందో లేదో తెలియదు..!