NTV Telugu Site icon

Peddireddy Ramachandrareddy: చంద్రబాబుకి మంత్రి పెద్దిరెడ్డి సవాల్

Babu Reddy

Babu Reddy

ఏపీలో వైసీపీ టీడీపీ నేతల సవాళ్ళు ప్రతి సవాళ్ళు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఎన్టీవీతో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో 97, 98 శాతం ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు. వచ్చే రెండేళ్లలో ఏం చేస్తారన్నది ముఖ్యమంత్రి చెబుతారు. నా రికార్డులను బ్రేక్ చేశారని గోబెల్స్ బాధపడి ఉండేవాడు. కుప్పాన్ని చంద్రబాబు పూర్తిగా వదిలేశాడని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి.

జిల్లాకు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు నేనే కనిపిస్తాను. రాజంపేట ఎవరి జాగీరో చంద్రబాబుకు తెలియదా??రాజంపేట నుంచి నా గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే టీడీపీ అంత ఎక్కువగా దెబ్బ తింటుంది. నేను, నా కుటుంబం అవినీతికి పాల్పడుతున్నాం అని నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. కాదని తేలితే చంద్రబాబు గుండు కొట్టించుకుంటాడా అని ఆయన ఛాలెంజ్ విసిరారు. ఈసారి ఎలాగైనా కుప్పంలో గెలవాలని పట్టుదలతో ఉన్నాం. కుప్పంలో పోటీ చేసే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ ప్లీనరీ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కుప్పం గడ్డపై వైసీపీ జెండా ఎగరేయాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గం మార్చేస్తారా? లేక ఇజ్జత్ కా సవాల్ అని కుప్పంలో గెలవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఇది ప్రజల యొక్క ప్లీనరీ. ఎవరింటికి వెళ్ళినా జగన్ పేరు తప్పా మరోకటి వినిపించటం లేదు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చి ఉండేదా అన్నప్పుడే చంద్రబాబు మతి భ్రమించిన విషయం అందరికి అర్థం అయ్యింది. చంద్రబాబు కన్నెర్ర చేసే మనిషి కాబట్టి ప్రజా కోర్టులో శిక్షించారన్నారు మంత్రి నారాయణస్వామి.

Lalu Prasad Yadav: ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ.. సింగపూర్ కు త‌ర‌లించే అవ‌కాశం