Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎం జగన్ అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించారని.. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఆ వివరాలు చూసుకుని ఏవైనా తప్పులుంటే టీడీపీ నేతలే చెప్పాలని హితవు పలికారు. కొన్ని మీడియా సంస్థలతో కలిసి టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.
Read Also: Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన బస్సు, 27 మంది మృతి
మరోవైపు ఈనెల 22న కుప్పంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు శనివారం శాంతిపురంలోని ఎస్‌ఎల్‌వీ కళ్యాణమండపంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశమయ్యారు. సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం జగన్ వస్తున్నారని.. గత 30 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేయలేని పనులను జగన్ పూర్తి చేస్తున్నారని ప్రశంసించారు. మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేశారని గుర్తుచేశారు.