NTV Telugu Site icon

Payyavula Keshav: తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడం బాధాకరం..

Payyavula

Payyavula

Payyavula Keshav: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయిన విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన మంత్రి పయ్యావుల కేశవ్.. నీటిని నిలువరించేందుకు తీసుకుంటున్న చర్యలపై కర్ణాటక ప్రభుత్వం, తుంగభద్ర డ్యాం ఇంజనీర్లతో పయ్యావుల కేశవ్ సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also: Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు.. నిందితుడు అరెస్ట్..

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడం బాధాకరం అని అన్నారు. తుంగభద్ర డ్యాంకు గేట్ లాక్ సిస్టం లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి.. గేట్ కొట్టుకుపోతే నీటిని నిలువరించే వ్యవస్థ తుంగభద్ర డ్యాంకు లేదు.. దీని వల్ల నీరు వృధాగా కిందకు పోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టుకుపోయిన గేట్ స్థానంలో ప్రత్యామ్నాయ గేట్ ఏర్పాటుకు ఏపీ వైపు నుంచి సాయం అందిస్తామన్నారు. రబ్బర్ డ్యాం ఏర్పాటు చేయాలా..? లేక వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా..? అని చూస్తున్నాం.. డ్యాం అధికారులతో.. గతంలో పని చేసిన గన్నయ్య నాయుడు లాంటి నిపుణులతో సంప్రదిస్తున్నామన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు తుంగభద్ర అత్యంత ప్రధానమైన డ్యాం.. గేట్ కొట్టుకుపోవడం వల్ల మిరప పంట వేసిన రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు.

Tungabhadra Dam 19th Gate Missing | Heavy Inflow to Tungabhadra | Ntv