Minister Narayana: స్వచ్చ ఆంధ్ర స్వర్ణాంధ్ర కోసం అందరూ సహకారం అందించాలని మంత్రి నారాయణ కోరారు. మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.. కానీ, మన రాష్ట్రంలో చంద్రబాబు స్వచ్ఛంద కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.. ప్రతి నెలా మూడో శనివారం ఒక నినాదంతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగునీటి కోసం 5 వేల 350 కోట్ల నిధులను తీసుకు వస్తే.. గత ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఆ నిధులను తీసుకువస్తున్నాం.. అమృత్ పథకం కింద కూడా నిధులను తెస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Hyderabad: గాలులు బీభత్సం.. బిల్డింగ్ పై నుంచి కూలీన భారీ క్రేన్.. పలు వాహనాలు ధ్వంసం
ఇక, వైసీపీ హయాంలో చెత్త పైన పన్ను వేసింది అని మంత్రి నారాయణ ఆరోపించింది. అది చెత్త ప్రభుత్వం.. అభివృద్ధిని నాశనం చేసింది అని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది అన్నారు. ఎలక్ట్రానిక్ వేస్టును పర్యావరణహితంగా నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేపట్టాం.. రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను గత ప్రభుత్వం వదిలేసి పోయింది.. వచ్చే అక్టోబర్ 2వ తేదీలోగా రాష్ట్రంలో చెత్త నిల్వలు లేకుండా చేస్తామని నారాయణ వెల్లడించారు.
