Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశం అయ్యారు. ఈ భేటీలో మలేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్ కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గనబతిరావ్, మలేషియా- ఆంధ్రా బిజినెస్ చాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ మీటింగ్ కొనసాగుతుంది. అమరావతి నిర్మాణం గురించి మలేషియా బృందానికి మంత్రి నారాయణ పలు అంశాలను వివరించారు.
Read Also: Auto Driver Seva: రేపు ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. వారికి ఏడాదికి రూ.15 వేలు!
అయితే, రెండున్నరేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మలేషియా ప్రతినిధులకు మంత్రి నారాయణ వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో అమరావతిని ఒకటిగా రూపుదిద్దుతామని తెలిపారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన మలేషియాకు చెందిన పలు ప్రైవేట్ సంస్థలు.. రాబోయే ఐదేళ్లలో 6000 నుంచి 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా పలు ప్రాజెక్టులను మంత్రి నారాయణకు వివరించిన మలేషియా బృందం.
