Site icon NTV Telugu

Minister Nara Lokesh: ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్వర్కింగ్ కి సహకారం అందించండి

Lokesh

Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో బిజీబిజీగా ఉన్నారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) ప్రతినిధులు, ఆ సంస్థ సీఈవో వెరోనికా పాపకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్ మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేలతో భేటీ అయ్యారు. 2017 నుంచి ప్రారంభమైన SIAలో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్, ఆక్వా కల్చర్, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 30 వేలకు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారన్న ప్రతినిధులు.. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు AUD 3.5 బిలియన్ విలువైన వాటాను అందిస్తోందన్నారు. బయో సెక్యూరిటీ, ఎగుమతి పని తీరును మెరుగు పర్చేందుకు ప్రభుత్వ, పరిశోధనా సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు ఎస్ఐఏ ప్రతినిధులు వెల్లడించారు.

Read Also: Tension in Tenali: చంద్రబాబు కాలనీలో ఉద్రిక్తత- చిన్నపిల్లల గొడవతో కుటుంబంపై దాడి

ఇక, మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్ లో అగ్రగామిగా ఉంది.. దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది.. 2024-25లో $7.4 బిలియన్ డాలర్ల (రూ.66 వేల కోట్లు) విలువైన 16.98 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి.. ఆస్ట్రేలియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్‌ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టాలి అని కోరారు. భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ విస్తరణ కోసం ఏపీ ఆక్వా పరిశ్రమదారులు, ఆస్ట్రేలియా దిగుమతి దారుల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయాలని నారా లోకేష్ పేర్కొన్నారు.

Read Also: Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

అయితే, ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, నిల్వ కాలాన్ని పెంచేందుకు ప్రాసెసింగ్‌, కోల్డ్ చైన్ మేనేజ్ మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ఆక్వా కల్చర్, మత్స్య సంపద నిర్వహణకు ఏపీ ఆక్వా పరిశ్రమదారులతో కలిసి నైపుణ్యాన్ని పంచుకోండీ అని కోరారు. రాష్ట్రంలో సీఫుడ్ వంటకాలను ప్రోత్సహించి, కలినరీ టూరిజంను ఆకర్షించేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టండి మంత్రి లోకేష్ అన్నారు.

Exit mobile version