తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంతరి కార్మూరి నాగేశ్వరరావు.. హరీష్ రావును రండి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి తొంగి చూడండి అని సవాల్ చేశారు.. ప్రతి ఇంట్లోనూ మళ్ళీ జగన్ రావాలి అని ప్రజలు అంటున్నారు.. ఇక్కడ ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, రోడ్లు.. ఇతర అంశాలను ప్రస్తావించిన హరీష్‌రావు.. ఏపీ కార్మికులు ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని.. ఏపీలో వదిలేయాలని సూచించిన నేపథ్యంలో.. ఈ రచ్చ మొదలైంది.. అయితే, హరీష్ వ్యాఖ్యలకు మంత్రి కార్మూరి కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ రోడ్ల సంగతి వాళ్ళు చూసుకుంటే మంచిది.. అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కార్మూరి.. ఒక వర్షం పడితే హైదరాబాద్ నగరం మునిగిపోతుంది.. ఇంత వరకు ఎందుకు ఏం చేయలేకపోయారు? అని నిలదీశారు.. హైదరాబాద్ లో రోడ్లు బాగుంటే సరిపోతుందా? మేం చేస్తున్నట్లు సంక్షేమ పథకాలను మీరు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.. మీ బొక్కలు, మీ లొసుగులు మీ ప్రతిపక్షాలే చెబుతాయి.. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను నేరుగా ప్రజల దగ్గరకే తీసుకుని వెళ్తున్నాం అని తెలిపారు మంత్రి కార్మూరి.
Read Also: Renu Desai: అసలు సలహాలు ఇవ్వడానికి మీరెవరు..? పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్
ఇక, కొత్తగా ఎన్నికైన మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు మంత్రి కార్మూరి.. మొత్తం 21 స్థానాల్లో ఎన్నికలు జరిగితే వైసీపీ 17 సాధించింది.. నాలుగు స్థానాల్లో గెలిచి టీడీపీ హడావిడి చేసిందని మండిపడ్డారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సున్నాకే చతికిలపడుతుందని జోస్యం చెప్పిన ఆయన.. ఇదే అవకాశం చంద్రబాబుకు వచ్చి ఉంటే వేల కోట్లు సంపాదించి ఉండేవారని ఆరోపించారు. ఎమ్మెల్సీ స్థానాలను డబ్బులకు అమ్ముకుని ఉండేవాడు.. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు డబ్బులు ఇచ్చారా? అని అడుగుతున్నారు? బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు, అధికారం ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.
