NTV Telugu Site icon

Karumuri Nageswara Rao: ఫోన్ ట్యాపింగ్ వివాదంపై మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు.. ఆ సర్వే రిపోర్ట్‌ వల్లే..!

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.. అయితే, ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సర్వేల్లో ఓటమి తప్పదని తెలిపోవడంతో టిక్కెట్లు రావనే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. ఫిరాయింపుల మీద లీకులు ఇచ్చి ఇప్పుడు ట్యాపింగ్ ఆరోపణలు చెయ్యడం అంటే వంకాలేనోడు డొంకపట్టుకుని వెళ్లాడటం తప్ప మరొకటి కాదంటూ ఎద్దేవా చేశారు.. పార్టీ వదిలి వెళ్లిపోతా మని లీకులు ఇచ్చి ఆరోపణలు చెయ్యడం చూస్తేనే అర్ధం అవుతోందన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్‌ అనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి విధానమన్న ఆయన.. టికెట్‌ గ్యారెంటీ లేకపోవడంతోనే ఆరోపణలు చేసి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.

Read Also: Rebels Of Thupakula Gudem Review: రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం రివ్యూ

అయితే, సర్వేల్లో ఓటమి తప్పదని తేలిన వాళ్లు పార్టీ వదిలి పోతున్నారని తెలిపారు మంత్రి కారుమూరు.. ఇక, వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న యువ నాయకుడు.. ముందు తన తండ్రిని నిలదీయాలి.. అని నారా లోకేష్‌కు సూచించారు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి చెయ్యాలేని అభివృద్ధి.. మూడున్నరేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో ఎలా సాధ్యం అయిందో తండ్రిని ప్రశ్నించాలన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి.. విమర్శలకు స్పందించే స్థాయి నాది కాదంటూ సెటైర్లు వేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. కాగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆరోపణలు.. మంత్రులు, వైసీపీ నేతల కౌంటర్లతో నెల్లూరు రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం విదితమే.. ఇక, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని.. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌గా పెట్టి.. కోటంరెడ్డిని సైడ్‌ చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్.