Site icon NTV Telugu

ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం: మంత్రి కన్నబాబు

విశాఖలోని హాయగ్రీవ భూముల వివాదంపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. జిల్లా అభివృద్ధి సమావేశంలో హయగ్రీవ భూములపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడారు. భూముల వివాదాల్లో అధికారపార్టీ ముఖ్య నేతలపై బురద చల్లి రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందన్నారు.

Read Also:పాల వెల్లువ కార్యక్రమంపై టీడీపీ రాద్ధాంతం చేస్తోంది: అప్పలరాజు

ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకుడదనేది ప్రభుత్వ విధానమని మంత్రి కన్నబాబు అన్నారు.దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. జీవీఎంసీ, VMRDA నుంచి పూర్తి సమాచారం సేకరించి సమగ్ర నివేదికను తొందరలో అందజేయాలన్నారు. హాయగ్రీవలో లోటుపాట్లు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Exit mobile version