జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలురైతుల ఆత్మహత్యలపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు రైతులకు ఏం చేశారని పవన్ అప్పుడు మౌనం వహించారన్నారు. తమ ప్రభుత్వం తరహాలో రైతులకు వడ్డీ లేని రుణం ఇచ్చారా? వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సునిశితంగా పరిశీలించి కౌలు రైతులతో సహా అందరికీ ప్రయోజనాలు అందజేస్తోందని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్‌కు రోడ్ మ్యాప్, రూట్ మ్యాప్ అన్నీ చంద్రబాబే ఇస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. గతంలో కూడా జగన్ సీఎం కాడు, కాలేడు అని పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పాడని.. అప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని.. రికార్డు స్థాయి మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్‌ది ఆవేశపూరిత రాజకీయం, జగన్‌ది ఆలోచనాత్మక రాజకీయమని మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుంచీ జగన్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని.. ఆయనకు ఇదేమీ కొత్త కాదని ఎద్దేవా చేశారు.
https://ntvtelugu.com/andhra-pradesh-number-one-state-in-ease-of-doing-business-over-all-india/
