NTV Telugu Site icon

Minister Kandula Durgesh: తెలుగు భాషను కాపాడుకుందాం.. మన సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతాం

Kandula Durgesh

Kandula Durgesh

Minister Kandula Durgesh: 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు విచ్చేసిన తెలుగువారికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల తరపున మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళా వేదిక ఖతార్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సుపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను కాపాడుకుంటాం.. తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెడుతాం అంటూ సదస్సులో చేస్తున్న ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరికీ దిశానిర్దేశం చేస్తుందన్నారు. విదేశాల్లో ఉంటూ తెలుగు భాష మీద మక్కువతో చేస్తున్న కార్యక్రమాలు అందరికీ మార్గదర్శకం అన్నారు.

Read Also: Champions Trophy: బీసీసీఐ అభ్యంతరం.. ఛాంపియన్స్ ట్రోపీ టూర్ షెడ్యూల్ మార్పు

అయితే, 9వ పర్యాయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వించదగ్గ అంశం అని రాష్ట్ర పర్యటన, సినిమాటోగ్రాఫి మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి విచ్చేసిన తెలుగువారు అందరు ఒకే వేదికపై నిలబడి తెలుగు భాషను కాపాడుకుంటాం.. తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెడుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తెలుగు భాష పట్ల ఆసక్తి కనబర్చాలని సూచించారు.