Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదు

Kakani1

Kakani1

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. అనైతిక పొత్తులతో పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఏపీలో ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, కరవు.. కవల పిల్లలు అని.. ప్రజలంతా ఫర్‌గెట్ బాబు అని భావిస్తున్నాని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని.. చంద్రబాబు తరహాలో జగన్ ప్రజలపై పన్నుల భారం విధించలేదని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్దిని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని.. చంద్రబాబు చేసే వ్యాఖ్యలు, ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈనెల 16న వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కాకాణి పేర్కొన్నారు. జూన్‌లో రైతులకు 3 వేల ట్రాక్టర్లు సహా 4014 వ్యవసాయ పరికరాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని.. జూన్ 15 లోపు పంట నష్ట పరిహారం పంపిణీ చేయాలన్నారని మంత్రి కాకాణి వెల్లడించారు.

Minister Jogi Ramesh: పొత్తు కోసం బాబు ఆరాటం, ప్యాకేజీ కోసం పవన్ పోరాటం..!

Exit mobile version