సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ పామ్ ధరలను నిర్ణయించనున్నట్టు తెలిపారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. అమరావతిలో ఇవాళ ఆయిల్ పామ్ రైతులు, కంపెనీల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తాం.. సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ మ్‌మ్ ధరలను నిర్ణయిస్తామ.. ఓఈఆర్ (ఆయిల్ ఎక్ట్రాక్సన్ రేషియో)ను శాస్త్రీయ విధానంలో అప్‌డేట్ చేస్తామని వెల్లడించారు.. ఇక, అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించి ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తామని తెలిపారు మంత్రి కాకాణి.. ఆయిల్ ప్‌మ్ ధరల నిర్ణయంలో రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు, గత ప్రభుత్వం చెల్లించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తోందని విమర్శించారు.. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆదేశాలిచ్చామని ఈ సందర్‌భంగా వెల్లడించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
Read Also: kollu Ravindra: సీఎం జగన్ రూ.10 వేలు ఇచ్చి.. రూ. 30 వేలు గుంజుతున్నారు..!
