మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకకు ఐటీ శాఖ నోటీసులు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, మంత్రి గుమ్మనూరు జయరాం.. తన భార్యకు ఐటీ నోటీసులపై స్పందించారు.. నా భార్య కు ఎలాంటి ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.. నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు.. మాది ఉమ్మడి కుటుంబం.. నాభార్య పై భూమి కొంటే బినామీ ఎలావుతుంది? అని నిలదీశారు.. నేను న్యాయ బద్ధంగా భూమి కొనుగోలు చేశానన్న ఆయన.. వ్యవసాయంలో సంపాదించి భూమి కొనుగోలు చేసినట్టు వెల్లడించారు.. ఇక, తాము కంపెనీ భూములు కొనలేదు.. రైతు బీడు పెట్టుకొని అమ్మితే కొనుగోలు చేసినట్టు వెల్లడించారు..
Read Also: CPI Narayana: మోడీకి కేసీఆర్ జై కొడితే.. రాత్రికి రాత్రే కేసులు మాయమౌతాయి
కాగా, గుమ్మనూరు జయరాం భార్య రేణుకకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం సాగుతోంది.. కర్నూలు జిల్లా అస్పరిలో కొనుగోలు చేసిన 30.83 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలపై ఐటీ నోటీసులు పంపింది. రూ. 52.42 లక్షల విలువైన భూ కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని తన నోటీసుల్లో పేర్కొంది ఐటీశాఖ.. మొత్తం 180 ఎకరాల భూమిలో రేణుకమ్మ పేరు మీద 30.83 ఎకరాలున్నట్టు పేర్కొంది.. మిగిలిన భూమి కూడా మంత్రి గుమ్మనూరు జయరాం బంధువుల పేరు మీదే రిజిస్టర్ అయినట్టు గుర్తించామని.. ఒకే రోజున మంత్రి భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్టర్ చేసినట్టు ఐటీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. అంతేకాదు.. 180 ఎకరాలను సీజ్ చేస్తున్నట్టు కూడా ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో.. అసలు ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదంటూ.. మంత్రి జయరాం పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.